KDP: పులివెందులలోని శ్రీ రంగనాథ స్వామి కూరగాయల మార్కెట్లో సమస్యలు తిష్ట వేశాయి. కోట్ల రూపాయలతో కూరగాయల మార్కెట్ ను నిర్మించారు. కానీ అందులో వసతులను మరిచారు. వ్యాపారాలు చేసుకునే వారికి కూరగాయల కోసం వచ్చే వారికి మరుగుదొడ్లను ఏర్పాటు చేయలేదు. కనీసం త్రాగునీటి వసతి కూడా కల్పించలేదని మార్కెట్లోని వ్యాపారులు కోసం వచ్చే ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు