కృష్ణా: పాడి రైతుల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం అవనిగడ్డ మండలం పులిగడ్డ రైతు సేవా కేంద్రం వద్ధ పశు ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం సౌజన్యంతో ఈ నెలాఖరు వరకు నిర్వహిస్తున్న పశు ఆరోగ్య శిబిరాలను పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.