SKLM: వంగర మండలం మడ్డువలస మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులు కరవయ్యాయి. తాగునీరు సదుపాయం లేకపోవడంతో పాటు, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పాఠశాల ప్రహరీ గోడ కూలి చాలా నెలలు గడిచినా మరమ్మతులు చేయలేదు. అధికారులు సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.