TG: రాష్ట్రంలో ఈనెల 26 నుంచి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం అమలు కానున్న విషయం తెలిసిందే. 2023- 24లో ఉపాధి హామీ పథకంలో కనీసం 20 పని దినాలు పూర్తి చేసిన వారికి కుటుంబం యూనిట్‌గా ప్రభుత్వం దీనిని అమలు చేయనుంది. ఈ మేరకు కుటుంబంలోని మహిళా బ్యాంకు ఖాతాలో ఏడాదికి రూ.12 వేలు జమ చేయనుంది. అందులో భాగంగా ఈనెల 26న తొలి విడతగా రూ.6 వేలు జమ చేయనున్నట్లు సమాచారం.