KKD: పిఠాపురం పట్టణం ఉప్పాడ బస్టాండ్ ప్రాంతంలో ఉన్న పార్కులో సోమవారం రాత్రి పిఠాపురం పోలీసులు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి OTP,, ఏటీఎం పాస్ వర్డ్, తదితర వివరాలను తెలపరాదన్నారు. అనుమానితులు ఎవరైనా ఫోన్ చేస్తే దగ్గర్లో ఉన్న పోలీసులకు, బ్యాంక్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.