KKD: పెద్దాపురంలో మంగళవారం నుంచి మూడు వార్డు సచివాలయాల్లో ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పురపాలిక కమిషనర్ కేవీ పద్మా వతి ఒక ప్రకటనలో తెలిపారు. గౌరీకోనేరు, వరహాలయ్యపేట, వీర్రాజు పేటలోని సచివాలయాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ నవీకరణ చేసుకోవాలన్నారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.