KKD: గొల్లప్రోలు మండలంలో మంగళవారం నుంచి ఉచిత పశుఆరోగ్య శిబిరాలు ప్రారంభమవుతాయని పశుసంవర్ధకశాఖ ఏడీ డాక్టర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో పశువులకు వివిధ రకాల టీకాలు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి, పాడి రైతులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.