PDPL: జిల్లాలో రేపు మిషన్ భగీరథ వాటర్ సరఫరా బంద్ ఉంటుందని ఈఈ మిషన్ భగీరథ గ్రిడ్ కే.పూర్ణచందర్ సోమవారం తెలిపారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాలు, పెద్దపల్లి, శ్రీరాంపూర్, జూలపల్లి, ఓదెల, ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాలు, పాలకుర్తి మండలంలోని అంతర్గంలోని ముర్మూరు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద సంపు పైప్ లైన్ నిర్వహణ పనుల నిమిత్తం త్రాగునీరు సరఫరా నిలిపివేయబడుతుంది అన్నారు.