ATP: ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల శ్రమను దోచుకుంటున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్న వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.