PDPL: జిల్లాలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డీ. వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీకృత కలెక్టరేట్లో జరుగుతాయని, అధికారులు, సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.