NGKL: తలకొండపల్లి మండలంలోని వెల్జాల గ్రామంలో ఉన్న శ్రీ వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు హాజరుకావాలని ఉత్సవ కమిటీ సభ్యులు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి సోమవారం ఆహ్వాన పత్రిక అందించారు. ఈనెల 7 నుంచి 9 వరకు జరిగే ఉత్సవాలకు సతి సమేతంగా హాజరుకావాలని ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాసమూర్తి, తదితరులు ఎమ్మెల్యేను ఆహ్వానించారు.