ప్రకాశం: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మార్కాపురం డీఎస్పీ నాగరాజు అర్ధవీడు పోలీస్ స్టేషన్ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ అధికారులకు దర్యాప్తులోని మెలుకువలను తెలిపి దొంగతనం మరియు శారీరక నేరాలపై దృష్టిపెట్టి త్వరితగతిన దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించారు. కేసుల్లో సాక్షాధారాలు, సాంకేతిక ఆధారాలు పక్కాగా సేకరించి కేసులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు.