SRCL: ఇందిర మహిళ శక్తి పథకం కింద అర్హులైన క్రైస్తవ మహిళలకు కుట్టు మిషన్ల సరఫరా కోసం దరఖాస్తు తేదీని ఈనెల 25వ తేదీ వరకు పొడిగించినట్టు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి రాధాబాయి తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. అర్హులైన క్రైస్తవ మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.