GDL: రాజోలి మండలం పెద్ద ధన్వాడ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్‌కు రైతులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎల్లప్ప మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ ఏర్పడితే పంట పొలాలలో సారవంతం తగ్గిపోయి పంటలు చేతికందవని అన్నారు. అదే విధంగా కలుషితమైన రసాయనాల ద్వారా చర్మ సంబంధ వ్యాధులు వస్తాయన్నారు.