సత్యసాయి: సోమందేపల్లిలో స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా రూ.14.40 లక్షలతో వర్క్ షెడ్లు నిర్మించడానికి 24 మంది చేనేత కార్మికులకు మంత్రి సవిత సోమవారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. టీడీపీ పార్టీలతోనే చేనేతలకు స్వర్ణ యుగమని అన్నారు. చేనేతలకు పూర్వవైభవం తెస్తామని మంత్రి సవిత పేర్కొన్నారు.