కృష్ణా: కంకిపాడు మండలం ఈడుపుగల్లులో స్థానిక బీసీ కాలనీ కట్టపై నివసిస్తున్న షేక్. ఏసుబాబు (38) సమీపంలోని బందరు కాలులో ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. ఎస్ఐ తాతా చార్యులు మాట్లాడుతూ.. ఆదివారం గోసాల వంతెన సమీపంలోని కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైందన్నారు. మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు చెప్పారు.