SRCL: జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించాలన్నారు.