అమెరికా సరిహద్దుల్లో నేరస్థులు పెట్రేగిపోతున్నారని.. దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీని విధిస్తామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. 2025ను అమెరికాకు స్వేచ్ఛాయుత సంవత్సరంగా ట్రంప్ అభివర్ణించారు. అక్రమ వలసలను అరికడటంతో పాటు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్నారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తామని వెల్లడించారు. పనామా కాలువను వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు.