NZB: పకడ్బందీగా గ్రామ సభలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. సోమవారం ఆయన రుద్రూర్లో సందర్శించారు. రుద్రూర్ బస్టాండ్ వెనుక వైపు ఉన్న భూములకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.