SRPT: అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి డిమాండ్ చేశారు. ఈరోజు సూర్యాపేటలో కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇందిరమ్మ ఇళ్ల హామీ నెరవేర్చలేదని విమర్శించారు. పింఛన్ల పెంపు, రైతు భరోసా వంటి వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.