తెలంగాణ(Telangana), ఛత్తీస్గడ్(Chhattisgarh) సరిహద్దుల్లో ఆదివారం ఎన్కౌంటర్(Encounter) జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మృతి చెందారు. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ సరిహద్దులోని ఖమ్మం జిల్లా చర్ల మండలం పుట్టపాడు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లు అధికారులు తెలిపారు. పోలీసు భద్రతా బలగాలు కూంబింగ్(Combing) నిర్వహిస్తుండగా మావోయిస్టులు కనిపించారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి.
ఛత్తీస్గడ్ (Chhattisgarh)లో గత కొన్ని రోజులుగా మావోయిస్టు కార్యకలాపాలు అరికట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో బలగాలను పెంచి కూంబింగ్(Combing) నిర్వహించారు. ఏప్రిల్ 26న ఛత్తీస్గడ్ లోని దంతెవాడలో మావోలు మందుపాతర పేల్చడంతో 11 మంది పోలీసులు మృతిచెందిన సంగతి తెలిసిందే.
భద్రతా బలగాలకు మావోయిస్టులు వల వేసి మందుపాతర పేల్చడంతో అధికారులు సీరియస్ అయ్యారు. దీంతో కూంబింగ్(Combing) ముమ్మరం చేశారు. ప్రజలను మావోల నుంచి కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. 2018 మే నెలలో కూడా దంతెవాడ జిల్లా చోల్నోర్ గ్రామంలో పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చడం చర్చనీయాంశమైంది. ఆ ఘటనలో ముగ్గురు చనిపోయారు. తాజాగా భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్న కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.