NRML: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో 432.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా సారంగాపూర్ మండలంలో 37.8, కుంటాల 27.6 బైంసా 26.4, లక్ష్మణ చింత 22.4, పెంబి 22.2, దిలావర్పూర్ మండలాలలో 19.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందన్నారు.