VKB: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ‘లిస్ట్- 3’ కారణంగా నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో సుమారు 10 ఇళ్లు కలెక్టర్ లాగిన్లో లిస్ట్-3లో ఉండటంతో మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవ తీసుకుని, తమ పేర్లను లిస్ట్-1 లోకి మార్చి ఇళ్లు కేటాయించాలని బాధితులు కోరుతున్నారు.