SRPT: కోదాడ పట్టణంలోని గాలి రమేష్ నాయుడు అయ్యప్ప స్వాముల అన్నదాన సన్నిధానంలో రేపు శనివారం నుంచి 70 రోజులపాటు అయ్యప్ప మాల, శివ స్వాముల మాలాధారుణలకు నిత్య అన్నదానం ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు గాలి శ్రీనివాస్ నాయుడు తెలిపారు. కోదాడలో గత 12 ఏళ్లుగా ప్రతి ఏడాది గాలి రమేష్ నాయుడు జ్ఞాపకార్థం శ్రీనివాస్ నాయుడు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.