SRD: ఖేడ్ మండలం లింగాపూర్ గ్రామంలో కొలువైన మార్కండేయ స్వామి ఆలయంలో ఆదివారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా పద్మశాలి కుల బాంధవులు, ఆలయ కమిటీ, గ్రామస్థుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణాన్ని వేదమంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణం తిలకించారు.