MNCL: వార్షిక తనిఖీలో భాగంగా సోమవారం జిల్లా DCP భాస్కర్, బెల్లంపల్లి మండలం తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసారు. స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాలు వాటిపై తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించారు. పిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలన్నారు.