కరీంనగర్ జిల్లాలో డీజిల్ కొరత కారణంగా యాసంగి వరి కోతలు ఆలస్యం అవుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో డీజిల్ అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ కొరతను సాకుగా చూపుతూ హార్వెస్టర్ యజమానులు ఎకరాకు అదనంగా రూ.1000 వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇది మరింత భారం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.