JGL: ధర్మపురి గోదావరి పరివాహక ప్రాంతాల్లోని రైతుల సాగునీటి కష్టాల గురించి సంబంధిత మంత్రి ఉత్తం కుమార్ రెడ్డికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోన్లో వివరించారు. సాగునీటి కోసం ధర్మపురి ప్రాంత రైతులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారని వివరించగా, మంత్రి సానుకూలంగా స్పందించి కలెక్టర్, సంబంధిత అధికారులు రివ్యూ నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.