ADB: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం కూలిపోవడంతో, కూలిన భవనాన్ని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు. పై కప్పు కూలిన విషయాన్ని తెలుసుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలు గురువారం రాత్రి కార్యాలయానికి వెళ్లి కూలిన ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో నాయకులు పాల్గొన్నారు.