SDPT: హుస్నాబాద్ మండలంలోని తోటపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన గూళ్ల లింగం, లావణ్య దంపతుల నూతన గృహప్రవేశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, పేదల ఇళ్ల కలను నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు.