అన్నమయ్య: మదనపల్లె జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఇవాల తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను జిల్లా కోఆర్డినేటర్ భార్గవాచారి పరిశీలించారు. ప్రసవానంతరం తల్లులు, శిశువులను వారి స్వగ్రామాలకు ఉచితంగా తరలిస్తున్నారా లేదా అని, వాహనాల పరిస్థితి, డ్రైవర్ల పనితీరును ఆయన సమీక్షించారు. నిర్లక్ష్యం వహించిన డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని భార్గవాచారి హెచ్చరించారు.