SRD: క్రిస్మస్ వేడుకలు బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. పటాన్ చెరు డివిజన్ జెపి కాలనీ మరనాద చర్చి, శాంతినగర్ కాలనీలోని సీఎస్సై చర్చిలలో క్రిస్మస్ వేడుకలకు పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పట్టణ ప్రజలు తదితరులు ఉన్నారు.