KMR: ఎల్లారెడ్డి మండలం అడవి లింగాలలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను బుధవారం ఎంపీవో ప్రకాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. పనుల పురోగతిని బట్టి ప్రభుత్వం దశలవారీగా బిల్లులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఎంతో ఉపయోగపడుతయాని పేర్కొన్నారు.