Fake chocolates: హైదరాబాద్ శివార్లలో నకిలీ చాక్లెట్లు.. గుట్టురట్టు చేసిన చాక్లెట్లు
ప్రస్తుత కాలంలో కాదేదీ కల్తీకి అనట్టు చేస్తున్నారు కేటుగాళ్లు. చిన్న పిల్లలు తినే చాకెట్లు కూడా కల్తీ చేస్తూ గలీజు దందా నిర్వహిస్తున్నారు. కాసులు కోసం కక్కుర్తి పడి పిల్లలకు అన్యాయం చేస్తున్నారు.
Fake chocolates: ప్రస్తుత కాలంలో కాదేదీ కల్తీకి అనట్టు చేస్తున్నారు కేటుగాళ్లు. చిన్న పిల్లలు తినే చాకెట్లు కూడా కల్తీ చేస్తూ గలీజు దందా నిర్వహిస్తున్నారు. కాసులు కోసం కక్కుర్తి పడి పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. వీళ్లకు వ్యాపారమే ముఖ్యం. అయ్యో చిన్న పిల్లలు అన్న కనీస మానవత్వం లేకుండా పోయింది. సెంటిమెంట్లు, మానవీయతలన్నీంటినీ మంటలో కలిపేశారు. రాజధాని శివారులో ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి చాక్లెట్లు తయారు చేస్తున్నారు. కుళ్లిన చింతపండు ఉడకబెట్టి వచ్చిన గుజ్జును చిన్నచిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేస్తున్నారు. ఇలా ప్యాకింగ్ చేయడంతో మురికి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హైదరాబాద్ శివారులోని హైదర్ గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ దందా జరుగుతోంది. అనూస్ ఇమ్లీ, క్యాండీ జెల్లీ చాక్లెట్లు తయారు చేస్తున్నారు. హానికరమైన రసాయనాలను ఉపయోగించి నిర్వాహకులు చాక్లెట్లను తయారు చేస్తున్నారు. దుర్గంధం వస్తున్న ప్రదేశంలోనే చాక్లెట్లను తయారు చేసి వాటికి ఆకర్షణీయమైన స్టిక్కర్లు వేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు.
నకిలీ తయారీ కేంద్రాల్లో చాక్లెట్ లాలీపాప్ లలో ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారు. వాటిని తిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. మనం పిల్లలకు ఆ చాక్లెట్లు కొనిపెట్టి వారిని రోగాల బారినపడేలా మనమే చేస్తున్నాము. మీరు పిల్లలకు తినిపించే అన్ని లోకల్ బ్రాండ్ చాక్లెట్లు నగర శివార్లలో తయారయ్యేవే. ఇది కూడా ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేయబడుతున్నాయి. వీటిపై దాడి చేసిన పోలీసులు గ్లూకోజ్ లిక్విడ్ , సిట్రిక్ యాసిడ్ పౌడర్, ఆరెంజ్ లిక్విడ్ ఫ్లేవర్స్, స్వీట్ హై వంటి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ తయారు చేసిన నకిలీ చాక్లెట్లను బేగంబజార్ హోల్ సేల్ వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడి నుంచి హోల్ సేల్ వ్యాపారులు ఈ చాక్లెట్లను మార్కెట్ లో రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తూ నగరంలోని చిన్న చిన్న దుకాణాలన్నింటికీ వెళ్తున్నారు.