Gangula Kamalkar : గంగుల కమలాకర్ కు బిగ్ రిలీఫ్.. ఆ కేసులో ఊరట
కరీంనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. గంగుల కమలాకర్ ఎన్నిక అనర్హత పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
Gangula Kamalakar comments Conspiracy to merge Telangana into Andhra pradesh bjp congress
Gangula Kamalkar : కరీంనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. గంగుల కమలాకర్ ఎన్నిక అనర్హత పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసు 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది. ఇందులో గంగుల ఎన్నికల్లో నిర్దేశించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేశారని ఆరోపిస్తూ ఆయన పొన్నం ప్రభాకర్ కోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇదే అంశంపై మరో ప్రత్యర్థి బండి సంజయ్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. రేపు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కమలాకర్ కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్, కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో గంగుల కమలాకర్ ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కేసీఆర్ కేబినెట్లో మంత్రి అయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ ఖర్చు చేశారంటూ గంగుల కమలాకర్‌కు వ్యతిరేకంగా ఇద్దరు ప్రత్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉంది. రేపు దానిపై విచారణ జరగనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కమలాకర్ కరీంనగర్ స్థానం నుండి తిరిగి BRS తరఫున పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్ బరిలో ఉన్నారు. ఈసారి పొన్నం ప్లేసులో కాంగ్రెస్ నుంచి పురుమళ్ల శ్రీనివాస్ ఎన్నికల బరిలో ఉన్నారు.