సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ బోనాల ఉత్సవాల్లో (Bonala festivals) ఘోరం చోటుచేసుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తుడు విద్యుదాఘాతం(Electrocution)తో మృతి చెందాడు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో విద్యుత్ స్తంభం తగిలి కరెంట్ షాక్ రావడంతో మరణించాడు. గమనించిన తోటి భక్తులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వెంటనే యువకుడి మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆకాష్ సింగ్ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
భక్తుడి మరణంతో కాసేపటి వరకు అమ్మవారి ప్రాంగణంలో అలజడి నెలకొంది. అనంతరం పోలీసుల (Police) చొరవతో తిరిగి యథావిథిగా భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు.మృతుడిని కార్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాష్(Akash)గా(23) గుర్తించారు.కాగా నిన్న రాత్రి కురిసిన వర్షం కారణంగా కరెంట్ పోల్(Current poll)కు పవర్ రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. రంగం(Rangam)లో మాతంగి స్వర్ణలత భవిష్కవాణి వినిపించారు. ఈ ఏడాది అగ్ని ప్రమదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వర్ణలత (Svarnalata) చెప్పారు. కాస్తా ఆలస్యమైనా మంచి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయందోళన చెందవద్దని అన్నారు.