భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) ఢిల్లీలో (Delhi) అంతా సిద్ధమవుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (BJP Telangana president) బండి సంజయ్ (Bandi Sanjay) గురువారం అన్నారు. తమ పార్టీ యువ మోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై ఆయన స్పందించిన ఆయన అందులో భాగంగా మాట్లాడారు. తమ కార్యకర్తలను జైలుకు తీసుకు వెళ్లడం సాధారణంగా మారిందని, అన్ని జిల్లాల్లో, అన్ని జైళ్లలో పెడుతున్నారని మండిపడ్డారు. అదే సందర్భంగా మాట్లాడుతూ… ఢిల్లీలో కవిత కోసం అంతా సిద్ధమవుతోందన్నారు.
ఈడీ (ED), సీబీఐ (CBI) వంటి కేంద్ర దర్యాఫ్తు సంస్థలు (central investigation agency india) విచారణకు పిలిస్తే వెళ్లక పోవడం విడ్డూరమని బీజేపీ నాయకురాలు (BJP Leader) విజయశాంతి (Vijayashanti) అన్నారు. మహిళను అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కల్వకుంట్ల ఫ్యామిలీ ఇష్యూ.. రేవంత్ రెడ్డి
కవిత ఈడీ విచారణ (kavitha ed enquiry) సాధారణ విషయమని, దీనిని రాద్ధాంతం చేయడం ఏమిటని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (Congress Telangana president) రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. విచారణ సంస్థ ఏం చేయాలో అది చేస్తుందని తెలుసుకోవాలన్నారు. గతంలో తమ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని ఈడీ కార్యాలయంలో కూర్చో బెట్టి విచారించారని గుర్తు చేసారు. కనీసం ఇక్కడ ఈడీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామంటే కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు. ఈ రోజు సానుభూతి కోసం కేసీఆర్ కుటుంబం ప్రయత్నాలు చేస్తోందన్నారు. వీరంతా తోడు దొంగలు అన్నారు. వాటా పంపకాల్లో తేడాలు రావడంతో ఈ చిల్లర పంచాయతీ వచ్చిందన్నారు. కవిత చేసిన తప్పులకు తెలంగాణకు అంటగడతారా అని ప్రశ్నించారు. నాలుగు కోట్ల ప్రజలకు సంబంధం లేదన్నారు. ఇది కేవలం నలుగురు కల్వకుంట్ల కుటుంబ సమస్య మాత్రమే అన్నారు.