»Dca Telangana Cancels Licence Nine Blood Banks Hyderabad
Hyderabad: హైదరాబాద్ బ్లడ్ బ్యాంకులకు డ్రగ్ కంట్రోలర్ నోటీసులు
రోజు రోజుకు ఎండలు ముదురుతున్నాయి. విద్యార్థులకు వార్షిక పరీక్షలు వస్తున్నాయి. విద్యార్థులంతా పరీక్షల సన్నద్ధంలో ఉండడంతో ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రావడం లేదు.
Hyderabad: రోజు రోజుకు ఎండలు ముదురుతున్నాయి. విద్యార్థులకు వార్షిక పరీక్షలు వస్తున్నాయి. విద్యార్థులంతా పరీక్షల సన్నద్ధంలో ఉండడంతో ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రావడం లేదు. దీంతో రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించడం లేదు. దీంతో నగరంలోని పలు బ్లడ్ బ్యాంకులు రక్తనిల్వలు నిండుకున్నాయి. చాలా మంది బ్లడ్ బ్యాంక్ మేనేజర్లు దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు రక్తంతో సహా ప్లాస్మా, ప్లేట్లెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బ్లడ్ బ్యాంకుల పేరుతో భారీగా వసూలు చేస్తున్నారు. ఈ పిశాచాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అప్రమత్తమై అనుమానిత బ్లడ్ బ్యాంకులపై దాడులు నిర్వహించారు. స్వచ్ఛంద సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్న పలు బ్లడ్ బ్యాంకులను గుర్తించి వాటి లైసెన్సులు రద్దు చేశారు.
నగరంలోని బ్లడ్ బ్యాంకులో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. తొమ్మిది బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ప్రమాణాలు పాటించని తొమ్మిది బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. బ్లడ్ బ్యాంకుల నిల్వ,, రక్త సేకరణ ..పరీక్షలలో పూర్తిగా లోపాలున్నట్లు గుర్తించింది. అంతే కాకుండా ప్లేట్లెట్స్ ,ప్లాస్మా నిల్వ లో కూడా పూర్తిగా లోపాలు గుర్తించింది డ్రగ్ కంట్రోల్ బ్యూరో. ఈ క్రమంలో తొమ్మిది బ్లడ్ బ్యాంకులకు నోటీసులు ఇచ్చింది. మలక్ పేట లోని శ్రీ బాలాజీ బ్లడ్ సెంటర్, చైతన్య పురిలోని నవజీవన్ బ్లడ్ సెంటర్, లక్డికాపూల్ లోని ఏవీఎస్ బ్లడ్ సెంటర్, హిమాయత్ నగర్లోని రుధిర వాలంటరీ బ్లడ్ సెంటర్, సికింద్రాబాద్ లోని ప్రతిమ సాయి బ్లడ్ సెంటర్, కోఠిలోని తలసేమియా రక్షిత బ్లడ్ సెంటర్, మెహదీపట్నం లోని వివేకానంద బ్లడ్ సెంటర్, బాలనగర్లోని నంది బ్లడ్ సెంటర్, ఉప్పల్ లోని ఎంఎస్ఎన్ బ్లడ్ సెంటర్లకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం గ్రేటర్లో ఐపీఎం సహా 76 ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీఓ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్లడ్ బాం్యకుల నిర్వాహకులు ప్రముఖుల బర్త్డేల పేరుతో ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ కంపెనీల్లో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు.