MHBD: మేడే వేడుకలను విజయవంతం చేయాలని ఐఎస్టీయూ నాయకులు హలవత్ లింగన్న, పర్వత కోటేష్ పిలుపునిచ్చారు. సోమవారం MHBD పట్టణ కేంద్రంలో IFTU నాయకులు గోడప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచడం కార్మికులపై భారమని విమర్శించారు.