JN: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవోలు, ఎస్డీసీలు, సంబంధిత జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన విధివిధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించి, అవగాహన కల్పించారు.