NZB: మెండోరా మండలం పోచంపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి చెందింది. ముప్కాల్కు చెందిన సాయి లిఖిత వారం రోజుల పాటు డెంగీతో బాధపడుతూ హైదరాబాద్లో చికిత్స పొందుతూ మరణించింది. పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని అమ్మాయి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట మృతదేహంతో నిరసన తెలిపారు.