BHPL: కాటారం మండలం గుమ్మలపల్లి గ్రామ సర్పంచ్‌గా 23 ఏళ్ల భక్తు శరత్ కుమార్ ఎన్నికై రికార్డు సృష్టించారు. మహదేవపూర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న శరత్ పిన్నవయస్కుడైన సర్పంచిగా గుర్తింపు పొందారు. రాజకీయాల ద్వారా గ్రామాభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో బరిలో దిగానని శరత్ తెలిపారు. యువత రాజకీయాల్లోకి వచ్చి గ్రామాల రూపురేఖలు మార్చాలని ఆకాంక్షించారు.