ELR: నూజివీడులో నిబంధనలకు విరుద్ధంగా మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. పశువైద్యాధికారి ధ్రువీకరణ (Stamp) లేకుండానే, అపరిశుభ్రమైన వాతావరణంలో జీవాలను వధిస్తున్నారు. కబేళాలో కాకుండా ఇళ్ల వద్దే కోసి, నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కిలో రూ. 900 పెట్టి కొంటున్నా, నాణ్యత లేని మాంసం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది.