SRPT: అధికారం నిర్లక్ష్యం పాలకుల అలసత్వంతో గ్రామాల్లోని వీధుల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో గత కొన్ని రోజులుగా ప్రజలు కష్టాలు చవిచూస్తున్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలోని పలు వీధుల్లో, పలు గ్రామాల్లో సైతం మంచినీళ్లు అందుబాటులోకి రాకపోవడంతో బోర్ల వద్దకు వెళ్లి వీధివాసులు నీళ్లు తెచ్చుకుంటున్నారు.