NLG: నార్కట్పల్లి మేజర్ గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యం లోపించడంతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. నల్గొండ రోడ్డులో రహదారి పక్కన పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయి అపరిశుభ్రతను తలపిస్తుంది. దోమలు, కుక్కల స్వైర విహారంతో ఇబ్బంది పడుతున్నామని సమీప నివాసితులు తెలుపుతున్నారు. పేరుకుపోయిన చెత్తాచెదారం వల్ల దుర్వాసన వ్యాపించడంతో ఇబ్బంది పడుతున్నారు.