GDL: రాజోలి సమీపంలోని సుంకేసుల బ్యారేజీ గేట్లకు మరమ్మతులు జరుగుతున్నాయని నిర్వహణ అధికారులు తెలిపారు. లీకేజీ ఎక్కువగా ఉన్న గేట్లకు రబ్బర్ సీల్ వేసేందుకు స్టాప్ లాక్ గేటు అమర్చి పనులు చేస్తున్నామన్నారు. ఆరు నెలల కిందట డ్యామేజ్ అయిన రూప్ను మార్చడం జరిగిందని, ఈ పనుల వల్ల కర్నూలు తాగునీటికి, కేసీ కెనాల్ సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించారు.