SKLM: పాతపట్నం మండలం గంగువాడ గ్రామ సచివాలయాన్ని గురువారం మండల గ్రామ–వార్డు సచివాలయ అధికారి బి.కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, సిబ్బంది హాజరు, పనితీరును పరిశీలించారు. సచివాలయం పరిధిలో పెండింగ్లో ఉన్న GSWS సర్వేల పురోగతిని సమీక్షించి, వాటిని త్వరగా పూర్తిచేయాలని సూచించారు.