KNR: తిమ్మాపూర్ మండలంలో ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ రెండు గంటలు పూర్తికావడంతో అధికారులు వివరాలను వెల్లడించారు. మండలంలోని 23 గ్రామాల్లో 38,414 ఓట్లకు 8,140 ఓట్లు పోల్ కాగా 21.19% నమోదు అయింది. మండలంలో అత్యధికంగా 34% ఓటింగ్ లక్ష్మీదేవి పల్లెలో నమోదయింది. ఇక్కడ 208లో 71 ఓట్లు పోల్ అయ్యాయని తెలిపారు.