కరీంనగర్: జిల్లాకు చెందిన అథ్లెట్ ఐ.అక్షరభ్యుదయ్కి అరుదైన గౌరవం దక్కింది. కరాటే ఇండియా ఆర్గనైజేషన్ జాతీయ అథ్లెట్ కమిషన్ సభ్యునిగా ఆయన ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా అక్షరభ్యుదయ్ రికార్డు సృష్టించారు. సంస్థ అధ్యక్షుడు భరత్ శర్మ ఈ మేరకు నియామకపత్రాన్ని జారీ చేశారు. భారత కరాటే జట్టు కోచ్, కియో జాయింట్ సెక్రటరీ ఆయనను అభినందించారు.