NLG: మొంథా తుఫాన్ ప్రభావంతో నల్లగొండ జిల్లాలోని పది మండలాల పరిధిలో కొంతమేరకు తడిసినటువంటి వరి ధాన్యం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో సుమారు 4,600 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తడిసినట్లు పేర్కొన్నారు.